Site icon NTV Telugu

S-500 Prometheus: S-400 మాత్రమే కాదు, S-500 కోసం చర్చలు.. పుతిన్ పర్యటనలో కీలక ఒప్పందం.!

S 500 Prometheus

S 500 Prometheus

S-500 Prometheus: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య రక్షణ, ఇంధనం రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌తో పాటు అధునాతన S-500 ప్రోమేతియస్ క్షిపణి వ్యవస్థ కూడా చర్చల్లో ఉంటుందని తెలుస్తోంది. 2018లో 5.43 బిలియన్ డాలర్లతో భారత్ ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేసింది. ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్ సమయంలో తన ప్రతాపాన్ని చూపించింది. వందల దూరంలో, పాకిస్తాన్ నుంచి దాడికి వస్తున్న క్షిపణులను, యుద్ధ విమానాలను కూల్చేసింది. ప్రస్తుతం, భారత్ మరిన్ని యూనిట్ల S-400లను కోరుతోంది.

ఇదిలా ఉంటే, పుతిన్ పర్యటనలో S-400 కొనుగోలుతో పాటు దీనికి అడ్వాన్డుడ్ వ్యవస్థ అయిన S-500 ప్రోమేతియస్‌పై కూడా ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం S-400కు అప్‌గ్రేడ్ వెర్షన్ మాత్రమే కాకుండా దీని సామర్థ్యాలు, ఉన్నతమైన ఆయుధ వ్యవస్థగా ఉంది. ఇంతకుముందులా, S-400లను రష్యా నుంచి కొనుగోలు చేసినట్లు కాకుండా, S-500 ఉత్పత్తిలో భారత్ కూడా పాలుపంచుకోవాలని భావిస్తోంది. భారత భాగస్వామిగా రష్యాకు చెందిన అల్మాజ్ ఆంటే కంపెనీతో కలసి ఈ క్షిపణి వ్యవస్థను స్థానికంగా తయారు చేసే అవకాశం ఉంది. S-400 భారతదేశ వైమానికి ఆధిపత్యానికి సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు S-500 వస్తే భారత వాయు, క్షిపణి నిరోధక వ్యవస్థ మరింత శత్రు దుర్భేధ్యంగా మారుతుంది. అంతరిక్ష ఆధిపత్యాన్ని కూడా అందిస్తుంది.

Read Also: PMO Rename: మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రధాని కార్యాలయం పేరు మార్పు..

వీటి మధ్య తేడాలు ఇవే:

* S-400 400 కి.మీ వరకు పరిధిని కలిగి ఉంటుంది, అయితే S-500 దాదాపు 500-600 కి.మీ వరకు విస్తరించి ఉంటుంది.

* S-400 30 కి.మీ ఎత్తు వరకు లక్ష్యాలను అడ్డుకుంటుంది, అయితే S-500 180-200 కి.మీ వరకు లక్ష్యాలను అడ్డుకుంటుంది.

* S-400 విమానం, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొంటుంది, అయితే S-500 వాటన్నింటితో పాటుగా దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొంటుంది, హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్స్‌ను అడ్డుకుంటుంది. S-400 థియేటర్ ఎయిర్ డిఫెన్స్‌కు మద్దతు ఇస్తుండగా, S-500 జాతీయ స్థాయి ఎయిర్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్ డిఫెన్స్‌కు మద్దతు ఇస్తుంది.

* ఈ రెండింటిలో క్షిపణులు భిన్నంగా ఉంటాయి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 48N6, 40N6 క్షిపణులను ఉపయోగిస్తుంది. S-500 వ్యవస్థ 77N6-N, 77N6-N1 హిట్-టు-కిల్ ఇంటర్‌సెప్టర్‌లను కలిగి ఉంటుంది.

* S-400 శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఒక ప్రాంతాన్ని రక్షిస్తుంది. S-500 వ్యవస్థ నగరాలను, కీలకమై జాతీయ ఆస్తుల్ని కూడా రక్షిస్తుంది.

Exit mobile version