Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..
- రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..
- ఫిబ్రవరి 28వ తేదీలోగా పట్టాలు పొందిన వారు అర్హులు..
- వివరాలకు ఏఈఓలను సంప్రదించాలన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఎవరు అర్హులు..?
Also Read
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి పట్టా పాస్ బుక్ పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులలో (ధరణి లేదా సంబంధిత పోర్టల్) భూమి వివరాలు నమోదై.. డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు మాత్రమే అర్హులు. ఇప్పటివరకు రైతు భరోసా పొందని వారు లేదా ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు…
కొత్తగా అర్హత సాధించిన రైతులు పలు పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా.. నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ఉండాలి.
Also Read:Weather Update: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
గతంలోనే రైతు భరోసా పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండటంతో.. నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. కొత్తగా పాస్ బుక్ పొందిన వారు సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఈవోలను సంప్రదించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. పథకంలో అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
రైతు భరోసా పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఒక ఎకరాకు రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!