తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.
Also Read : Niharika Konidela: మెగా డాటర్ బర్త్ డే.. చైతు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే పరిగెత్తాల్సిందే
అయితే.. ప్రతీ ఏడాది తెలంగాణ సర్కార్ రెండు విడతలుగా అంటే వానాకాలం సీజన్‌కు ముందు, యాసంగి సీజన్‌కు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడికి సాయంగా అందిస్తోంది. అయితే.. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ అవడం, మధ్యలో ఎలాంటి వారికి డబ్బులు చెల్లించాల్సి రాకపోవడంతో ఈ పథకం పట్ల బాగా ఆకర్షితులయ్యారు రైతులు. టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం కీలక పాత్ర పోషిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : Numaish : నుమాయిష్‌కు అనుమతి ఇవ్వకండి.. హైకోర్టులో న్యాయవాది పిటిషన్
