NTV Telugu Site icon

Russia: పలు సంస్థలపై పడిన ఉగ్రవాద ముద్రను చెరిపేందుకు రష్యా కొత్త చట్టం

Puthin

Puthin

Russia: పలు సంస్థలపై రష్యా ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి రిలీఫ్ కల్పించేందుకు మాస్కో రెడీ అవుతుంది. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉగ్ర సంస్థలకు ఆ ముద్రను క్యాన్సిల్ చేసే హక్కు కోర్టులకు అప్పగించింది. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగవ సభ స్టేట్‌ డూమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతుంది.

Read Also: Daikin: ఏపీలో ‘డైకిన్‌’ భారీ పెట్టుబడులు.. శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్‌!

కాగా, ఈ చట్టంతో ఉగ్ర కార్యకలాపాలకు ఆయా సంస్థలు దూరంగా ఉన్నట్లు న్యాయస్థానం గుర్తిస్తే జాబితా నుంచి వాటిని తొలగించే ఛాన్స్ ఉంది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు రష్యాకు లైన్ క్లియర్ అవుతుంది. మొట్టమొదటిగా 2003లో ఆఫ్గాన్ తాలిబన్లను రష్యా ఉగ్ర సంస్థలుగా ప్రకటించింది. ఆ తర్వాత సిరియా తిరుగుబాటుదారులను అందులో అటాచ్ చేసింది. అయితే, సరిహద్దు దేశమైన సిరియాలో రెబల్స్ తిరుగుబాటుతో బషర్ అల్-అసద్ పాలనకు ముగింపు పలికింది.

Read Also: Congress: అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా.. క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు!

అయితే, ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని రష్యా సైనిక స్థావరాలకు ప్రమాదం పొంచి ఉంది. అక్కడి హయత్ తహ్రీర్ అల్ షామ్ ని ఉగ్రవాద ముద్ర నుంచి తొలగించాలని మాస్కోలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సిరియాలోని కొత్త సర్కార్ తో మాస్కో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెడీ అవుతుంది. మరోవైపు క్రెమ్లిన్ ఈ వారంలో అక్కడి కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి.

Show comments