NTV Telugu Site icon

Viral Video: ఆమెతో సెల్ఫీ దిగాలంటే రూ.100 చెల్లించాల్సిందే

Viral

Viral

Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్స్ గా మారి ప్రపంచంలోని వివిధ అంశాలపై వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇకపోతే, కొందరు విదేశీయులు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి వారికి నచ్చిన అంశాలని.. అలాగే వారికి జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రావెల్ కంటెంట్ సృష్టికర్తలు వివిధ దేశాల్లోని పరిస్థితులను తెలియజేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. తాజాగా రష్యాకి చెందిన ఓ ట్రావెల్ కంటెంట్ భారతదేశంలో పర్యటనకు వచ్చిన సమయంలో ఓ వింత పని చేయడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Thug Life : ఆ రెండు రాష్ట్రాల ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు!

మనలో చాలామంది ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిన సమయంలో మనకు విదేశీ పర్యాటకులు కనపడితే వారితో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే, ఇందుకు కొందరు ఫోటోగ్రాఫ్ ఇవ్వడానికి ఇష్టపడతారు. మరికొందరు ఇష్టపడరు. కానీ రష్యా కు చెందిన ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త ఏంజలీనా మాత్రం ఈ పనిని ఆదాయం మార్గంగా మార్చుకుంది. భారత్ లోని సముద్రపు బీచ్ ను సందర్శిస్తున్న సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు ఆమెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేశారు. అయితే, చాలామంది ఆమెతో సెల్ఫీ తీయడానికి ఉత్సాహం చూపించడంతో ఏంజలీనా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఒక్కో సెల్ఫీకి వంద రూపాయలు అంటూ ఓ పోస్టర్ తీసుకొని నిలబడింది. అయినా కానీ, కొందరు భారతీయులు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి తెగ ఉత్సాహం చూపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. విదేశీయులు భారతదేశ బీచ్ లను చూడడానికి వచ్చినప్పుడు చాలా కష్టం అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా డబ్బులు సంపాదించడానికి నీకు వర్కింగ్ వీసా ఇచ్చారా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో నీ పని చాలా బాగుంది ఇండియా ట్రిప్ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.