జంతువులతో మసులుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చనువు ఇచ్చింది కదా? అని హద్దులు దాటితే మాత్రం వాటి ప్రతాపం చూడాల్సి వస్తోంది. అయినా జంతువుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అటవి శాఖ అధికారులు చెబుతుంటారు. అయినా కూడా కొంత మంది హద్దుమీరుతుంటారు. ఈ మధ్య కేరళలో ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా జైపూర్‌లో జరిగిన ఘటన చూస్తే.. భయాందోళన కలగించింది. ఓ ఏనుగు సృష్టించిన బీభత్సంతో బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
జైపూర్‌లోని అమెర్ ఫోర్ట్ దగ్గర సవారీకి ఉపయోగించే ఏనుగు ఒక్కసారిగా తన ప్రతాపం చూపించింది. టూరిస్టులను హఠాత్తుగా గాల్లోకి విసిరేసింది. మహిళా పర్యాటకురాలిని అయితే తొండంతో గిరి గిరి తప్పి విసిరేసింది. దీంతో ఒక రష్యన్ టూరిస్ట్ గాయపడగా.. మరో పర్యాటకురాలికి కాలు విరిగిందని సమాచారం.
మొత్తానికి ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. తక్షణమే ఏనుగులను అటవిలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి, మంత్రులు ఆదేశించారు.
ఈ సంఘటన ఫిబ్రవరి 13న జరిగింది. ఆలస్యంగా వీడియో వెలుగులోకి వచ్చింది. ఏనుగు తన తొండంతో మహిళను పట్టుకుని గిర గిర తిప్పుతూ నేలపైకి విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. గాయపడ్డ రష్యన్ పర్యాటకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఈ ఏనుగు పర్యాటకుల్ని గాయపరిచినట్లుగా తెలుస్తోంది.
Respected @BhajanLalBjp, @KumariDiya, and @ForestRajasthan, frustrated elephant Gouri (ride no 86) has attacked another person. Please send her to a sanctuary and replace the use of elephants with decorated electric cars at Amer Fort. pic.twitter.com/dpgch63RMv
— PETA India (@PetaIndia) February 28, 2024