NTV Telugu Site icon

Ukraine-Russian Conflict: పుతిన్‌ నోట సంధి మాట.. తిరస్కరించిన ఉక్రెయిన్..!

Putin

Putin

ఉక్రెయిన్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ దళాలు వెళ్లిపోవాలి, నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను ఆ దేశం విరమించుకోవాలని షరతులు పెట్టింది. వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానన్నారు. పుతిన్‌ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ అన్నారు. అ కారణంగా యుద్ధం స్టార్ట్ చేసిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టీన్‌ చెప్పుకొచ్చారు. ఇది శాంతి ప్రతిపాదన కాదు.. తీవ్ర దాడికి, మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ విమర్శలు గుప్పించారు.

Read Also: CM Chandrababu: నేడు టీడీపీ ఆఫీస్‌కి చంద్రబాబు.. ప్రభుత్వం-పార్టీ మధ్య గ్యాప్‌ లేకుండా కొత్త ప్లాన్..!

ఇక, ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలతో శని, ఆదివారాల్లో స్విట్జర్లాండ్‌ సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు ఇటలీలో జరుగుతున్న జీ-7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు, అమెరికా- ఉక్రెయిన్‌ల మధ్య పదేళ్ల పాటు రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ సంధి ప్రతిపాదన చేశాడు. స్విట్జర్లాండ్‌లో నిర్వహించే భేటీకి హాజరయ్యేందుకు రష్యా నిరాకరించింది. నా ప్రతిపాదనను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే జరుగుతున్న రక్తపాతానికి రాజకీయ, నైతిక బాధ్యత వాటిదేనని వ్లాదిమీర్ పుతిన్ హెచ్చరించారు.

Read Also: Mumbai court: షీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్…(వీడియో)

అలాగే, అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్‌ కొనసాగాలి.. సైనిక బలాన్ని పరిమితం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను రక్షించాలి.. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. అయితే, పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండడంతో దానిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే పుతిన్‌ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

Show comments