Site icon NTV Telugu

Fighter Jet Crashes: ఇంటిపై కుప్పకూలిన యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Fighter Jet

Fighter Jet

Fighter Jet Crashes: రష్యాకు చెందిన సుఖోయ్‌-30 యుద్ధ విమానం సైబీరియాలోని ఓ నివాస భవనంపై కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఇర్కుట్స్క్ నగరంలోని రెండస్తుల ఓ నివాస భవనంపై రష్యాకు చెందిన యుద్ధ విమానం కూలిపోయిందని సైబీరియాలోని రష్యా అత్యవసర విభాగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాద సమయంలో ఆ భవనంలో రెండు కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.

Indians Missing: కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయులు మృతి

ఇద్దరు పైలట్లు మినహా మరెవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. సుఖోయ్ యుద్ధ విమానానికి సంబంధించి ఆరు రోజుల్లో ఇది రెండవ ఘటన అని అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో మరెవరూ గాయపడలేదని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ టెలిగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు.

 

Exit mobile version