NTV Telugu Site icon

Volodymyr Zelenskyy : ఐఎస్ఐఎస్ కంటే రష్యానే ప్రమాదకరం

Jelenski

Jelenski

రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరంకు పైగా యద్దం కొనసాగుతుంది. రష్యాపై తీవ్రమైన ఆరోపణలకు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ దిగాడు. ఐసీస్ కంటే రష్యా ప్రమాదకరమైందని.. ఆ దేశ సైనికుల అకృత్యాలు మరీ దారుణంగా ఉంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ విమర్శించారు. తాజాగా రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఓ వ్యక్తి తల కిరాతకంగా చంపారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చనిపోయిన వ్యక్తి చేతికి ఉక్రెయిన్ సైనికులు ధరించే యెల్లో బ్యాండ్ ఉండడంతో.. అతను ఉక్రెయిన్ సైనికుడు అయ్యి ఉంటాడని అంతా భావించారు. అయితే అతడు సైనికుడేనని ఉక్రెయిన్ తాజాగా దానిని ధృవీకరించింది.

Read Also : Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. పది వేలు దాటిన కోవిడ్ కేసులు

ప్రపంచంలో ఎవరూ విస్మరించలేని విషయం ఒకటి ఉంది.. ఈ జంతువులు ఎంత సులువుగా మనుషుల్ని చంపుతున్నాయో.. రష్యా ఐసీస్ కంటే ఘోరమైంది. మహా ప్రమాదకరమైంది అంటూ వైరల్ వీడియోపై మరో వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా సైతం ఈ భయానక వీడియో పై తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు భద్రతా సంస్థ ప్రకటించింది. అయితే వైరల్ అవుతున్న వీడియో పై మాస్కో వర్గాలు ఇంకా స్పందించలేదు. గతంలో ఉక్రెయిన్ ఆక్రమణ సందర్భంగా ఇలాంటి వీడియోలు చాలనే వైరల్ అయ్యాయి. అయితే వాటన్నింటినీ ఖండిస్తూ క్రెమ్లిన్ వచ్చింది. ఇస్లామిక్ దేశాలపైనా ఇరాక్, సిరాయాలలో ఐసీస్ ఉగ్రవాదులు 2014-17 మధ్య నరమేధం సృష్టించారు. మనుషుల్ని నరికి చంపుతూ.. ఆ వీడియోలు రిలీజ్ చేశారు.

Read Also : Fire accident: మల్లాపూర్‌ ఘటన.. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం