Site icon NTV Telugu

Russia Ukraine War: యుద్ధంలో దేవుడు రక్షిస్తాడు.. రష్యన్ కమాండర్ భుజాలపై గణేష్, హనుమాన్ పచ్చబొట్లు

Russia Ukraine War

Russia Ukraine War

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ యుద్ధంలో రష్యా కొంత వరకు ఆక్రమించింది. తిరిగి దానిని కోల్పోయింది. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్ట పోయింది. రెండు దేశాలతో పాటు ప్రపంచం కూడా చాలా నష్టపోయింది. 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమైన యుద్ధంలో ఉక్రెయిన్ అనేక భూభాగాలను కోల్పోయింది. క్షిపణి ఎటువైపు నుంచి పడిపోతుందో అది అంచనాల వేయలేకపోతుంది. దీంతో ఎక్కడా లేని విధంగా విధ్వంసకర పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాల పేర్లు తొలగించబడ్డాయి.

ఇప్పుడు వాగ్నర్ గ్రూప్ రష్యాలో తిరుగుబాటు చేసింది. ఈ యుద్ధంలో వాగ్నర్ రష్యాకు భారీ విజయాన్ని అందించాడని అంటున్నారు. రష్యా అధికారిక సైన్యం లిమాన్, ఖార్కివ్, ఖెర్సన్లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. సోలెడార్‌లో వాగ్నర్ సైన్యం రష్యాకు మొదటి విజయం అందించారు. వాగ్నర్ నెలల పోరాటం తర్వాత రష్యన్ జెండాను ఎగురవేశారు. వాగ్నర్ గ్రూప్ నిజానికి అమెరికా, యూరప్ దృష్టిలో ఉగ్రవాద సంస్థ.

Read Also:Durga Devi Stotram: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యం, అనంత పుణ్యఫలం

రష్యా ఎందుకు యుద్ధం చేస్తోంది?
రష్యాకు, ఉక్రెయిన్‌లో యుద్ధం కేవలం భూభాగంపై యుద్ధం కాదు. నిజానికి.. ఇది రష్యాకు మనుగడ పోరాటం. నాటో, రష్యా బలగాలు పరస్పరం ఘర్షణకు దిగనంత వరకు యుద్ధం కొనసాగుతుంది. అనేక NATO దేశాలు ఉపయోగిస్తున్న F-16 ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ కొద్ది రోజుల్లోనే పొందుతుంది. దీని తరువాత యుద్ధం మరింత బలీయమైన రూపం తీసుకోవచ్చు.

భుజాలపై గణేష్-హనుమాన్ పచ్చబొట్లు
ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియాకు చెందిన జర్నలిస్ట్ యుద్ధపరిసర ప్రాంతాల్లో పర్యటించి తన అనుభవాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే రష్యా మిలటరీ కమాండర్‌తో ముచ్చటించాడు. అతను కొన్ని రోజులు భారతదేశంలో నివసించాడు. కమాండర్ హనుమంతుడు, గణేషుని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అతను తన చేతులపై ఓం నమః శివయ్ టాటూలను కూడా కలిగి ఉన్నాడు. బాలీవుడ్ సినిమాలు కూడా చూస్తుంటాడు. అక్కడ మిథున్ చక్రవతి చాలా ఫేమస్.

Read Also:AI Research: త్వరలో మృతదేహాన్ని కూడా బతికించొచ్చు

Exit mobile version