NTV Telugu Site icon

Crude Oil : దిగొచ్చిన రష్యా.. పాకిస్తాన్‎కు క్రూడాయిల్ సరఫరాకు ఓకే

Crude Oil : ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత, ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీన్ని ఎదుర్కోవడానికి, రష్యా తన మిత్రదేశాలకు తగ్గింపు ధరలకు ముడి చమురును సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. చైనా, భారతదేశం, వివిధ యూరోపియన్ దేశాలు ఈ ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా సహా దేశాలు భారత్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కూడా భారత్ – రష్యా అనుకూల కార్యకలాపాలకు పాల్పడవద్దని డిమాండ్ చేస్తోంది. అయితే వాటి ఖర్చు తగ్గింపే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Ring Recovery: అక్కడ ఇరుక్కున్న ఉంగరం.. అగ్నిమాపక సిబ్బంది ఎలా రక్షించారంటే?

అయితే, భారత్‌కు సరఫరా చేస్తున్న అదే ధరకు పాకిస్థాన్‌కు ముడి చమురును సరఫరా చేసేందుకు రష్యా ముందుగా నిరాకరించింది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ, ‘రష్యా మాకు తగ్గింపు ధరకు ముడి చమురును అందిస్తోంది. కానీ ఆ రాయితీ తక్కువే’ అన్నారు. రష్యా ద్వారా సరఫరా చేయబడిన తక్కువ ధర ముడి చమురును భారతదేశం ప్రధాన దిగుమతిదారుగా ఉంది. దానిని శుద్ధి చేసి భారత్ పొరుగుదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్నందున, రష్యాలో పనిచేస్తున్న అమెరికన్, యుకె, జర్మన్ ఆటోమొబైల్, టెక్నాలజీ కంపెనీలు అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఫలితంగా, రష్యాలో వాహనాలకు మరమ్మతులు నిలిచిపోయాయి. నిర్ధిష్టమైన 500 వస్తువులను ఎగుమతి చేయాలని రష్యా భారత్ ను అభ్యర్థించింది. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ వంటి దేశాల నుంచి ఆర్డర్లు కోల్పోయే అవకాశం ఉన్నందున భారత కంపెనీలు రష్యాకు ఎగుమతి చేసేందుకు వెనుకాడుతున్నాయి.

Show comments