Site icon NTV Telugu

Russia: ఉక్రెయిన్ దాడిలో 89 మంది సైనికులే చనిపోయారు.. ప్రకటించిన రష్యా

Russia

Russia

Russia: న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్‌లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, దాడికి ప్రధాన కారణం సైనికులు మొబైల్ ఫోన్‌లను అక్రమంగా ఉపయోగించడమేనని మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యన్‌ సైనికుల శిబిరమైన వొకేషనల్‌ కాలేజీ బిల్డింగ్‌పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడిచేసిన సంగతి తెలసిందే. ఈ ఘటనలో 300 నుంచి 400 మంది ప్రత్యర్థి సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అయితే ఆ దాడిని ధ్రువీకరించిన రష్యా రక్షణ శాఖ.. మొదట 63 మంది సైనికులు మృతిచెందారని తెలిపింది.

Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్

తాజాగా క్షిపణి దాడుల్లో 89 మంది సైనికులు మృత్యువాత పడ్డారని ఓ ప్రకటన విడుదల చేసింంది. దాడికి ప్రధాన కారణం.. బిల్డింగ్‌లో ఉన్న సైనికులు అనుమతి లేకుండా మూకుమ్మడిగా సెల్‌ఫోన్లను వినియోగించడమేనని తెలిపింది. అమెరికా సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేసిన ఉక్రెయిన్‌ దళాలు.. రష్యా సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డాయని చెప్పింది. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం వీడియో ప్రసంగంలో దాడి గురించి ప్రస్తావించలేదు, అందులో రష్యా తన అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి పెద్ద దాడిని ప్రారంభించనుందని అన్నారు. రష్యా సృష్టించిన ఆటుపోట్లను తిప్పికొట్టడానికి ఎంతవరకైనా సిద్ధమని.. దానిలో ఎలాంటి సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు.

Exit mobile version