NTV Telugu Site icon

Russia Explosion: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి! 60 మందికి గాయాలు

Explosion In Makhachkala

Explosion In Makhachkala

12 Dead and 60 Injured in Fire at Makhachkala in Russia: రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ గ్యాస్‌ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరోవైపు దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు మంగళవారం తెల్లవారుజామున దృవీకరించారు. డాగేస్తాన్‌ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

కాస్పియన్‌ సముద్రం ఒడ్డున ఉన్న మఖచ్కల నగరంలో హైవే పక్కన ఉన్న ఓ కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్‌ స్టేషన్‌కు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 260 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయి.

Also Read: Gold Today Price: మగువలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు! భారీగా తగ్గిన వెండి

ఈ అగ్ని ప్రమాదంలో పలు కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. గాయపడిన వారి సంఖ్య 60కి పైగా ఉంది. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు డాగేస్తానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు మంగళవారం తెల్లవారుజామున విడుదల చేసిన ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఓ భారీ అంతస్థుల భవనం దగ్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది.