Site icon NTV Telugu

India Russia Relations: భారత్-రష్యాపై అమెరికాతో సహా పాశ్చాత్య దేశాల ఒత్తిడి..! తగ్గేదేలే అంటున్న ఇరు దేశాలు..?

India Russia

India Russia

India Russia Relations: భారత్, రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సుంకాలు విధించిన భారత్‌ తగ్గేదేలే అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లోని రష్యా రాయబారి కీలక ప్రకటన చేశారు.

READ MORE: Vishva Hindu Parishad: క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా రాజమౌళి సినిమాలు ఆపేస్తాం!

రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ TASSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పాశ్చాత్య దేశాల అడ్డంకులు ఉన్నప్పటికీ రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. భారత్‌కు మంచి ఆఫర్‌లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంధన వనరుల కొనుగోలు నిమిత్తం మంచి ఒప్పందాలను చేసుకోవడానికి రష్యా సిద్ధం.” అని తెలిపారు. రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలను విధించింది. రోస్నెఫ్ట్, లుకోయిల్‌పై అమెరికా విధించిన ఆంక్షలు ఖచ్చితంగా చమురు సరఫరాలపై ప్రభావం చూపుతాయి. కానీ మాకు చమురే ప్రాధాన్యం. భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారులలో ఒకటిగా రష్యా తన హోదాను కొనసాగిస్తుందని మేము విశ్వసిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు. రష్యా-భారత సంబంధాలను దెబ్బతీసేందుకు పాశ్చాత్య దేశాల ప్రయత్నాలను భారతదేశం తీవ్రంగా ప్రతిఘటించిందని రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని దాటవేసి విధించిన ఏకపక్ష చట్టవిరుద్ధ ఆంక్షలను భారత్ గుర్తించదని నొక్కి చెప్పారు. ఇటువంటి ఆంక్షలు పాశ్చాత్య వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.

READ MORE: I Bomma Ravi : ఐ బొమ్మ రవి తొలిరోజు కస్టడీ.. కీలక విషయాలు రాబట్టిన పోలీసులు

Exit mobile version