UN Security Council: భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ 77వ సెషన్‌లో భారత విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ ఈ విషయంపై మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ తో పాటు బ్రెజిల్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆయన స్పష్టం చేశారు.
భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని వివరించారు. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. . ఈ ఐదు దేశాల్లో ఇప్పటికి నాలుగు దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు తెలిపాయి. కేవలం ఒక చైనా మాత్రమే అడ్డుకుంటోంది. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది
అదే సమయంలో, కొత్తగా పాశ్చాత్య దేశాలకు భద్రతామండలిలో స్థానం కల్పించడం వల్ల ఉపయోగం ఉండదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఎందుకంటే పశ్చిమ దేశాలు చాలావరకు అమెరికాకే మద్దతు పలుకుతాయని, మండలిలో మరిన్ని పశ్చిమ దేశాలకు ప్రాతినిధ్యం కల్పించినా, పెద్దగా మార్పేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్ అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. శాశ్వత సభ్యత్వానికి సరిపోయే దేశం అని వివరించారు. అంతర్జాతీయ అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న దేశాలుగా తాము ఇండియా, బ్రెజిల్‌లను భావిస్తున్నట్టు తెలిపారు. కాబట్టి, ఈ రెండు దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని పేర్కొన్నారు.
PM Narendra Modi: చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరు భగత్ సింగ్‌గా మార్పు.. ప్రకటించిన పీఎం మోదీ
ఇదే సెషన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామికం చేసేలా రష్యా ఆలోచనలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా భద్రతా మండలిని మరింత ప్రజాస్వామికం చేయాలన్న ఉద్దేశాలు రష్యా ఆలోచనల్లో ప్రస్ఫుటిస్తున్నాయని తెలిపారు. అదే విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైనా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించారు. తాము శాంతి నెలకొల్పాలని పిలుపు ఇస్తున్నట్టు తెలిపారు. దౌత్య మార్గాన్ని అవలంభించి ఈ యుద్ధానికి చరమగీతం పాడాలని సూచించారు. ఈ యుద్ధంలో భారత్ శాంతివైపు నిలబడిందన్నారు.
