NTV Telugu Site icon

Russia Ukraine War: సైన్యానికి పుతిన్‌ తాజా ఆదేశాలు ఇవే..!

Peke

Peke

ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సైన్యాన్ని ఆదేశించారు. ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. తమ లక్ష్యం నెరవేరేవరకూ దాడులు చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగానికీ వెనకాడబోమని హెచ్చరించింది. మరింత దూకుడు పెంచిన అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని తన సైన్యాన్ని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Anshu: మన్మథుడు బ్యూటీ రీ ఎంట్రీ ఫిక్స్.. భలే సినిమా పట్టేసిందే?

విన్యాసాల్లో భాగంగా.. సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటామని.. వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. రష్యాపై పాశ్చాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ అణ్వాయుధ విన్యాసాల్లో గగనతల, నావికాదళాలు పాల్గొంటాయని ప్రకటించింది. వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్ధం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ మిత్ర దేశాలు చేస్తోన్న రెచ్చగొట్టే ప్రకటనలకు దీటుగా పుతిన్‌ నుంచి ఈ వార్నింగ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్లకుపైగా కొనసాగుతోన్న యుద్ధం.. రష్యా-నాటో మధ్య ఘర్షణకు దారితీయవచ్చని పాశ్చాత్య దేశాలు గతంలో ఆందోళన వ్యక్తంచేశాయి.

ఇది కూడా చదవండి: Director: పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

గత రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌‌ను రష్యా ధ్వంసం చేసింది. ఇంకా యుద్ధం కొనసాగిస్తోంది. దీనికి ముగింపు పలికే సూచనలు కనిపించడం లేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

ఇది కూడా చదవండి: Israel: రఫాపై ఇజ్రాయెల్‌ దండయాత్ర.. భారీ దాడులకు ఏర్పాట్లు

Show comments