NTV Telugu Site icon

Rules Ranjan : రూల్స్ రంజన్ డిజిటల్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..

Whatsapp Image 2023 10 06 At 9.45.28 Pm

Whatsapp Image 2023 10 06 At 9.45.28 Pm

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నేడు (అక్టోబర్ 6) థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‍ గా నటించింది.విడుదలకు ముందే ఈ సినిమాకు పాటలు మరియు ట్రైలర్‌తో మోస్తరు బజ్ క్రియేట్ అయింది… ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. రూల్స్ రంజన్ సినిమాలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ అది, వైవా హర్ష, అన్నూ కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అమ్రీశ్ సంగీతం అందించారు. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించిన ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పించారు.మంచి అంచనాల మధ్యే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, రూల్స్ రంజన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన రూల్స్ రంజన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

అయితే, రూల్స్ రంజన్‍లో హీరోయిన్ నేహాశెట్టి పర్ఫార్మెన్స్, గ్లామర్ షోపై మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. కిరణ్ – నేహా మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. అయితే, కథ, కథనం విషయంలో మాత్రం ఈ సినిమాపై నెగటివ్ టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే రూల్స్ రంజన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మంచి రేటుకే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందని సమాచారం.. నవంబర్ తొలి వారంలో రూల్స్ రంజన్ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ముందుగా నిర్ణయించారని తెలుస్తుంది ఈ చిత్రానికి టాక్ ఆశించిన స్థాయిలో టాక్ రాకపోవటంతో అనుకున్న దాని కంటే ముందే ఈ చిత్రానికి స్ట్రీమింగ్‍కు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తుంది.అక్టోబర్ మూడో వారంలోనే రూల్స్ రంజన్ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.