ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రగతి పథంలో దూసుకువెళుతోంది. 2022-23 ఏడాదిలో ఆర్టీసీ ప్రగతిపథంలో ముందుకు వెళ్తుందన్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు. (Dwaraka Tirumala Rao) ఏప్రిల్ – ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఒ ఆర్ సాధించాం అన్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా సగటున రోజుకు 5802 పార్సిళ్లు బుక్ అవుతున్నాయి. గత ఏడాది ఆర్టీసీ కార్గో ద్వారా రూ 122 కోట్లు ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో 998 కొత్త అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించాం.. ఇప్పటి వరకు 410 రూట్లులో టెండర్లు ఖరారయ్యాయని ఎండీ తెలిపారు.
బస్సుల్లో జరిగే ప్రమాదాల నివారణకు అన్ని ఆటోమేటిక్ డోర్లు పెట్టాలని నిర్ణయించాం..7లక్షల లోపు తిరిగిన ఎక్స్ ప్రెస్, డీలక్స్ ,సూపర్ లగ్జరీ 1100బస్సుల్ని నవీకరిస్తాం. ఎపీఎస్ ఆర్టీసీలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ప్రవేశపెడుతున్నాం. 62బస్సులకు టెండర్లు పిలిచాం.. 30బస్సులు వచ్చాయి. స్టార్ లైనర్…స్లీప్ ట్రావెల్ అండ్ రిలాక్స్ … పేరిట ఈ బస్సులు రోడ్డెక్కిస్తాం అన్నారు. ఖాళీ స్థలాల్లో సెమి పర్మినెంట్ లేదా టెంపరెరీ నిర్మాణాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని ద్వారకా తిరుమల రావు తెలిపారు.
Read Also: Allu Aravind: అవును.. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలుసుకోవడం లేదు.. కానీ
రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లతో పలు బస్టాండ్ల ఆధునికీకరణ చేస్తున్నాం. కొన్ని ప్రధాన 24గంటలు కార్గో బుకింగ్ చేసుకునేలా త్వరలో చర్యలు తీసుకుంటాం. బస్సుల్లో డిజిటల్ లావాదేవీల కోసం UTS…(యూనిఫైడ్ టికెట్ సొల్యూషన్) విధానం విజయవంతమైంది. టికెట్ బుకింగ్, బస్ పాస్ లు ,కార్గో తదితర అన్ని సేవలు ఒకే యాప్ కింద తీసుకు వస్తున్నాం. అన్ని బస్సు ల్లో డిజిటల్ లావాదేవీలతో కూడిన ఈపోస్ టిమ్ మిషన్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించాం..ఈపోస్ టిమ్ యంత్రాలను నెలకు 680రూపాయలు చొప్పున అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి అన్ని బస్సుల్లో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెడతాం. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగుల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ మేరకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. వచ్చే నెలలో కొత్త పీఆర్సీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తాం. మాకు నెలకు 600కోట్లు వరకు ఆదాయం వస్తుంది వీటిలో 50శాతం ఇందనానికి 40శాతం వేతనాలకే సరిపోతుంది. గత నెలలో మాకు 500కోట్లు వస్తే 124కోట్లు ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చాం. ఆర్టీసీకి వచ్చిన ఆదాయంలో 25 శాతం ప్రభుత్వానికి ఇస్తున్నాం. నెలకు 300కోట్లు వేతనాలకోసం ప్రభుత్వం మాకు ఇస్తాంది..మేము మాకు వచ్చిన ఆదాయంలో 25శాతం ఇస్తున్నాం. ప్రయాణికులను ఆకర్షించేందుకు త్వరలో బస్సుల్లో టికెట్ పై రాయితీ ఇచ్చే పథకాలు ప్రవేశపెడతాం అన్నారు ఎండీ ద్వారకా తిరుమల రావు.
Read Also: Naveen Polishetty: ‘జల్సా’ టికెట్స్ కావాలా.. నన్ను అడగండి అంటున్న జాతిరత్నం