Site icon NTV Telugu

Road Accident: ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్.. లారీ ఢీకొనడంతో..!

Road Accident

Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేక్‌లు ఫెయిల్‌ అయ్యాయి.. కానీ, ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం.. బస్సులో ఉన్న అందరి ప్రాణాలు దక్కేలా చేసింది.. ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడటం ఏంటి..? అని ఆశ్చర్యపోకండి అదే నిజం లేదంటే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. వారిని ఓ ట్రాన్స్ పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అంటున్నారు బస్సులోని ప్రయాణికులు, స్థానికులు..

Read Also: Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.. అయితే, నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ.. అందరీ ప్రాణాలు కాపాడింది.. ఎందుకంటే.. ఆ లారీని అనుకోని విధంగా ఆర్టీసీ బస్సుకు ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో.. పెను ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. లేకపోతే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెబుతున్నారు.. ట్రాన్స్‌పోర్ట్‌ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయ్యింది.. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెట్లూరువారిపాలెం – ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది. లారీ డ్రైవర్‌కు గానీ, బస్సు డ్రైవర్‌కి గానీ ఎటువంటి గాయాలు కాలేదు.. అయితే, లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతిందని చెబుతున్నారు ప్రత్యక్షసాక్షలు.

Exit mobile version