Accident: ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం, ఐదుగురికి తీవ్రగాయాలు

  • తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
  • ఒకరు మృతి..ఐదుగురికి తీవ్రగాయాలు
Road Accident

Road Accident

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న మరి కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Read Also: Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌..జైల్లో ఏం జరుగుతోంది..?