తెలంగాణలో ఇవాళ్టి నుంచి స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. విద్యార్ధులను తరలించే బస్సులపై రవాణా అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. వనస్థలిపురం లో స్కూల్ బస్సులపై తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సుల సీజ్ చేశారు.
Read Also : Manipur Violence: నెలరోజులుగా హింస.. నిరాశ్రయులైన 50వేలమంది
అలాగే ప్రైవేట్ పాఠశాలల బస్సులను విసృతంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, బస్సులో ఫైర్ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఎల్బీనగర్ లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. ఫిట్నెస్ అయిపోయినా విద్యార్థులను తీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు.
Read Also : Ts Police: త్వరలో తెలంగాణలో భారీగా పోలీసుల బదిలీలు!
రవాణా శాఖ పదే పదే హెచ్చరించినా ప్రైవేటు విద్యా సంస్థల తీరు మారడం లేదన్నారు. దీంతో ఇప్పటికే జిల్లాల్లోని పలు ప్రైవేట్ స్కూల్ బస్సులు నిబంధనలు ఉల్లంఘించడంతో సీజ్ చేశారు. వివిధ పాఠశాలకు చెందిన ఆరు బస్సులను రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. బస్సుల ఫిట్ నెస్ విషయంలో నిబంధనలు పాటించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా రూల్స్ ప్రకారం నడుచుకోవాలని హెచ్చరిస్తున్నారు.