Mohan Bhagwat: భారతీయ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని పునరుద్ఘాటించారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. అమెరికా సుంకాలు భారతదేశానికి పెద్ద సవాలుగా మారాయన్నారు. దీని ప్రభావం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. స్వావలంబన అంశాన్ని ప్రస్తావించారు. స్వదేశీ, స్వావలంబనను మరేదీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. భారతదేశం తన అన్ని స్నేహపూర్వక దేశాలతో దౌత్య సంబంధాలను ఎలా కొనసాగించాలో వివరించారు.
REDA MORE: BJP: విదేశాల్లో భారత్‌ను కించపరుస్తున్న రాహుల్ గాంధీ.. బీజేపీ నేతల ఆగ్రహం..
స్వదేశీ వస్తువులపై మొగ్గు చూపాలని నొక్కి చెప్పారు. దేశం స్వదేశీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు. “ఆ దేశ స్వంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా సుంకాల విధానాన్ని రూపొందించింది. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. ప్రస్తుతం ప్రపంచం పరస్పరం ఆధారపడి పనిచేస్తుంది… ఏ దేశం ఒంటరిగా ఉనికిలో ఉండదు. ఈ ఆధారపడటం సైతం తప్పనిసరి కాకూడదు. మనం స్వదేశీ వనరులపై ఆధారపడాలి. స్వావలంబనపై దృష్టి పెట్టాలి. మన స్నేహపూర్వక దేశాలన్నింటితో దౌత్య సంబంధాలను కొనసాగించడానికి మనం కృషి చేయాలి. ఇది స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేకుండా జరగాలి.” అని పేర్కొ్న్నారు.
