NTV Telugu Site icon

RS Praveen Kumar: బీజేపీకి మేము వ్యతిరేకం.. మతోన్మాదానికి దూరం.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు..

Rs Praveen

Rs Praveen

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సిర్పూర్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరిష్ బాబుకు అభినందనలు తెలిపారు. అధికార బీఆర్ఎస్ పార్టీ దాడులు, రిగ్గింగ్ లు చేసిన ఎన్నో ఆటంకాలు సృష్టించి పోలీసులపై దాడులు చేసిన బహుజన సమాజ్ పార్టీకి 44 వేల ఓట్ల వేసిన సిర్పూర్ ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పారు. సిర్పూర్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పుకొండి.. అందరికి అండగా ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. ఓడిపోయినా నేను సిర్పూర్ లోనే ఉంటా ఇక్కడి సమస్యలపై పోరాటం చేస్తాను.. అసెంబ్లీలో మేము ఉంటే సిర్పూర్ ని అభివృద్ధి చేస్తామని అనుకున్నాము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Read Also: Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

బీజేపీ పార్టీకి మేము వ్యతిరేకం, మతోన్మాదానికి దూరం, మేము ఏ పార్టీకి పొత్తు పెట్టుకోలేదు అని బీఎస్పీ చీఫ్ ఆర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీజేపీని గెలిపించడానికి వచ్చామనే వార్తలు అవాస్తవం.. మేము గెలవటానికి మాత్రమే వచ్చాము.. నా ఓటమి కారణం ప్రజలే.. మా క్యాడర్ పూర్తిగా ఫామ్ కాకపోవడం చాల సమస్యల వలన బీఎస్పీ రాష్ట్రంలో ఒక్క సీట్ గెలువలేకపోయాము.. ఓటు బ్యాంకు సాధించాము.. వచ్చే అన్ని ఎన్నికలలో పోటీ చేస్తాం.. గెలుస్తామని ఆశీస్తున్నాను అని ఆయన అన్నారు. ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుంటాము.. గుండాగిరిని సాగనివ్వం.. ఎట్టి పరిస్థితుల్లో మతోన్మాదాన్ని సాగనివ్వం.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై గెలుపొందారు.. ఒకే దొర వెళ్తే మరో దొరకు అవకాశం వచ్చింది.. సిర్పూర్ లో హెల్ప్ లైన్ నెంబర్ కొనసాగుతుంది.. ప్రజల సమస్యలను ఆ నెంబర్ కు కాల్ చేయండి.. ప్రజలకు సేవ చేసే ప్రతి అవకాశాన్ని మేము వదలం.. శాంతబద్రతలను కాపాడుతాం.. సిర్పూర్ లో కుటుంబ సమేతంగా ఉంటా.. హైదరాబాద్ కు వెళ్ళిన సిర్పూర్ సమస్యల కోసమే పోటీ చేస్తాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.