NTV Telugu Site icon

Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి

Ongloe

Ongloe

ముక్కు పచ్చలారని పసికందును అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. సభ్య సమాజం తలదించునేలా చేస్తున్న కొందరు ఆడవారమని మరిచి ఆడ శిశువుని విక్రయిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో పేగు బంధాన్ని తెచ్చుకుంటున్నారు. నవ మాసాలు మోసి డబ్బులకు కక్కుర్తి పడి శిశువులను విక్రయిస్తున్నారు. తాజాగా.. కన్నతల్లి కూతురిని రూ. 10 వేలకు విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా ఒంగోలులో శిశువు విక్రయం కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్ లో రూ. పది వేలకు కన్న కూతురుని విక్రయించింది తల్లి. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన ఓ వ్యక్తికి మధ్యవర్తుల ద్వారా విక్రయించింది. అయితే.. పాపను వారికి అమ్మిన తర్వాత రిమ్స్ లో కనిపించకుండా పోయింది అంగన్వాడీ కార్యకర్త.

Read Also: Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?

అయితే.. అంగన్వాడీ కార్యకర్త రక్త హీనతతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం తెలుసుకుని రిమ్స్ వైద్యులు.. బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. వెంటనే.. పోలీసులు పాప ఆచూకీని వెతికి పట్టుకుని క్షేమంగా తీసుకువచ్చారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments