NTV Telugu Site icon

TS Excise Department: తక్కువ ధరకు లిక్కర్ అమ్మితే రూ.4 లక్షల ఫైన్..

Drinkers

Drinkers

TS Excise Department: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రచారం తారాస్థాయికి చేరనుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఓటింగ్ సమయం దగ్గరపడుతుండగా మరోవైపు ఎక్సైజ్ పాలసీ కూడా ముగియనుంది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో మద్యం దుకాణదారులు తమ వద్ద ఉన్న మొత్తం స్టాక్‌ను విక్రయించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాల్సి ఉంటుంది. సెలవుల కారణంగా మద్యం దుకాణాలు తమ వద్ద ఉన్న మొత్తం నిల్వలను విక్రయించలేకపోవడంతో మద్యం విక్రయదారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఎంఆర్‌పి ధర కంటే తక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్న వ్యాపారుల స్టాక్‌ను తక్కువ సమయంలో క్లియర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది.

Read also: Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించరాదని ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతిబుధ్‌ ప్రకాశ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ కంటే తక్కువ మద్యం విక్రయిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మద్యం వ్యాపారులు ఇలా చేస్తే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ముగిసినందున మద్యం వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఆ తర్వాత 30వ తేదీ వరకు మాత్రమే మద్యం వ్యాపారులకు సరుకులు విక్రయించేందుకు సమయం ఉంది. పెద్ద ఎత్తున విక్రయాలు జరిగినప్పుడు మాత్రమే స్టాక్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 28 నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్‌. కొత్త లైసెన్సులు డిసెంబర్ 1 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు.
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..