NTV Telugu Site icon

Mumbai: ఆఫిస్ కి ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా..ఐదు సార్లు పెనాల్టీ కట్టిన కంపెనీ వ్యవస్థాపకుడు

New Project (5)

New Project (5)

ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు. షా తన సిబ్బందిని ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవడం తప్పనిసరి చేశారు. ఎవరైనా ఆలస్యంగా వస్తే.. రూ.200 జరిమానా విధించారు. దురదృష్టవశాత్తూ కొత్త నియమంతో ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. వారంలోపు కౌశల్ కార్యాలయానికి అయిదు సార్లు ఆలస్యంగా వచ్చారు. దీంతో నియమం పెట్టిన వ్యక్తే రూ. 1,000 చెల్లించాల్సి వచ్చింది.

READ MORE: Mushrooms Benefits : పుట్టగొడుగులను మహిళలు ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్‌”లో తాను చెల్లించిన నగదుకు సంబంధించి స్ర్కీన్ షార్టు పోస్టు చేశారు. “కార్యాలయంలో ఉత్పాదకతను పెంచడానికి.. ప్రతి ఒక్కరూ ఉదయం 9:30 గంటలకు ఆఫీసులో ఉండాలని నేను కఠినమైన నియమం పెట్టాను. ఇంతకుముందు మేము 10-11 గంటలకు వచ్చేవాళ్లం. ఆలస్యంగా వచ్చిన వాళ్లు రూ. 200 జరిమానాగా చెల్లిస్తారు. ఇది నేను 5వ సారి చెల్లిస్తున్నాను.” అని రాసుకొచ్చారు. కాగా చాలా మంది నెటిజన్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ ఖాతా ఎవరిదని వ్యాఖ్యానించారు. జరిమానాలను వసూలు చేయడానికి తాను ప్రత్యేక UPI లైట్ ఖాతాను సృష్టించినట్లు షా తెలిపారు. జరిమానా ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా జట్టు కార్యకలాపాలు, డైనింగ్, ఇతర టీమ్ ఈవెంట్‌ల వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.

Show comments