ఈజీమనీకి అలవాటు పడిన కొందరు దొంగనోట్ల ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలామణికి పాల్పడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతోంది ముఠా. ఒకే నంబర్ తో కూడిన 200 రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడంతో విషయం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Also Read:India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత..
కాగా ఫేక్ కరెన్సీని గుర్తించేందుకు ఆర్బీఐ కు సంబంధించిన RBI Kehta Hai వెబ్‌సైట్‌లోనే Know Your BankNotes వెళ్లి అక్కడ ఒరిజినల్ నోట్ల ఫీచర్స్ తెలుసుకోవచ్చు.ఒరిజినల్ నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య తేడాలు ఈజీగా గుర్తించొచ్చు. చలామణిలో ఉన్న అన్ని కరెన్సీ నోట్ల ఫీచర్లు తెలుసుకోవచ్చు. రూ. 200 ఫేక్ కరెన్సీని ఎలా గుర్తించాలంటే.. ఒరిజినల్ నోట్ సైజ్ 66mmX146mm లో ఉంటుంది. నోటుపై మహాత్మా గాంధీ చిత్రానికి ఎడమవైపున దేవనాగరి లిపిలో నిలువుగా రూ. 200 అని రాసి ఉంటుంది.
దాని కింద బయటకు కనిపించకుండా 200 అని రాసి ఉంటుంది. మైక్రో లెటర్స్ లో ఆర్బీఐ, భారత్, ఇండియా అని ఉంటుంది. గాంధీ చిత్రం పక్కన నిలువుగా ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్‌లో ఉండి నోటును అటుఇటు కదిపితే బ్లూ కలర్‌లోకి మారుతుంది. దీన్ని టచ్ చేసినప్పుడు వేళ్లకు తగులుతుంది. అలా తగలకపోతే అదిఫేక్ నోట్ అని గుర్తించాలి. గాంధీ చిత్రానికి కుడి వైపున ఆర్బీఐ సింబల్, గవర్నర్ సంతకం దానిపైన ప్రామిస్ క్లాజ్ ఉంటుంది.
Also Read:Heavy Rains: నల్లమల అడవిలో భారీ వర్షాలు.. వరద నీటితో విద్యార్థులు ఇబ్బందులు
నోటుపై ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీ చిత్రం, ఎలక్ట్రోటైప్‌లో రూ. 200 వాటర్ మార్క్ ఉంటుంది. కుడివైపు దిగువన రూ. 200 నంబర్ కింద నంబర్ ప్యానెల్ ఉంటుంది. ఇది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజుకు పెరుగుతూ ఉంటుంది. కుడి వైపు చివరన అశోక స్తంభం ఉంటుంది. నోటు చివర్లో రెండు, రెండు చొప్పున అడ్డగీతలు ఉంటాయి. నోటుకు వెనకవైపు నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ్ భారత్ లోగో, లాంగ్వేజ్ ప్యానెల్, సాంఛీ స్థూపం, చివరగా దేవనాగరి లిపిలో రూ. 200 అని ఉండటం చూడొచ్చు. రూ. 200నోటుపై ఉన్న ఈ ఫీచర్స్ తో నకిలీ నోట్లను గుర్తించొచ్చు. దొంగ నోట్లను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి అడ్డుకట్ట వేయొచ్చు.
