NTV Telugu Site icon

RRR : 2025 లండన్ లో “RRR” హవా.. డీటెయిల్స్ ఇవే

Rrr

Rrr

RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ అవార్డును కూడా సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా క్రేజ్ తగ్గలేదు.

Read Also:Shamshabad: మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..

ఈ సినిమాను అన్ని దేశాల్లో రిలీజ్ చేశారు.. జపాన్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు.. అంతగా సినిమాకు జపాన్ ప్రజలు కనెక్ట్ అయ్యారు.. ఆ సినిమా పై మాత్రమే కాదు.. సినిమాలో నటించి హీరోల పై కూడా అభిమానాన్ని పెంచుకున్నారు. మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ చిత్రాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ సినిమా దెబ్బతో వరల్డ్ వైడ్ తెలుగు సినిమా పేరు మార్మోగిపోయింది.

Read Also:IND vs NZ: నేడు తేలనున్న మూడో టెస్ట్ ఫలితం.. టీమిండియా విజయం బాట పడుతుందా?

అయితే వెస్ట్రన్ ఆడియెన్స్ ని ఎంతగానో అలరించిన ఈ సినిమా మేకర్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి ఎలాంటి ట్యూన్స్ అందించారో తెలిసిందే. మెయిన్ గా తన సాంగ్ నాటు నాటు కు ఆస్కార్ కూడా వచ్చింది. ఇలా ఆస్కార్ స్టేజి మీద అవార్డు అందుకున్న కీరవాణి ఇపుడు 2025 లండన్ లో ఓ ఎపిక్ షో అయితే ఇవ్వబోతున్నారు. అక్కడ ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో కీరవాణి ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని లైవ్ లో ఆలపించనున్నారు. దీంతో అక్కడ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా ఆర్ఆర్ఆర్ స్కోర్స్ ని లైవ్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలి అంటే బుక్ చేసుకుని రావచ్చని తెలిపారు. మరి ఈ లైవ్ ఆర్కెస్ట్రా 2025 మే 11 న జరపనున్నట్టుగా అనౌన్స్ చేశారు.

Show comments