Site icon NTV Telugu

RRR Movie : 25 ఏళ్ల రజనీకాంత్ రికార్డును తిరగరాసిన ట్రిపుల్ఆర్ మూవీ

Rrr Japan

Rrr Japan

RRR Movie : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ఆర్ సినిమా విడుదలై 8నెలలైనా దాని ప్రభంజనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఇక అవార్డులైతే లెక్కేలేదు. మొన్న రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు.. నిన్న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినేషన్స్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు.. 25 ఏళ్ల కింద రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా జపాన్‌లో హైయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది.

Read Also: Sreeleela: థియేటర్‌లో టికెట్లు అమ్మిన హీరోయిన్.. ఎగబడిన ప్రేక్షకులు

25 ఏళ్లుగా ఈ రికార్డు రజినీకాంత్ పేరు మీదే ఉంది. ఆయన ముత్తు సినిమా పాతికేళ్ల కింద ఈ రికార్డు సెట్ చేసింది. 25 ఏళ్లుగా ఎన్ని సినిమాలు వచ్చినా.. ముత్తు కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోయాయి. తాజాగా ట్రిపుల్ ఆర్‌ 55 రోజుల్లోనే 2 లక్షల 71 వేల ఫుట్ ఫాల్స్‌తో పాటు.. 410 జపనీస్ మిలియన్ యెన్స్ వసూలు చేసింది. ట్రిపుల్ఆర్‌ను జపాన్ లో బాగా ప్రమోట్ చేసింది టీం. రాజమౌళితో పాటు చరణ్, తారక్ సైతం జపాన్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ముత్తు 25 రికార్డు బ్రేక్ చేయగలిగింది. 400 జపనీస్ మిలియన్లు యెన్స్‌తో ముత్తు రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో 300 మిలియన్లతో బాహుబలి ఉంది.

Exit mobile version