NTV Telugu Site icon

Railway Jobs: ఆ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలు..

Jobs

Jobs

RRC wr sports quota recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగనుంది. ఈ పోస్ట్‌లు కానీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం RRC WR స్పోర్ట్స్ కోటా అధికారిక నోటీసును జారీ చేయబడింది. దీని కోసం మొత్తం 64 పోస్ట్‌ లలో రిక్రూట్మెంట్ జరగనుంది. RRC WR స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2024 ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో

ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 16 ఆగస్టు 2024, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 సెప్టెంబర్ 2024. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ. 500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, ESM, PWD, EBC, మైనారిటీ, మహిళా అభ్యర్థులు కేవలం రూ. 250/- చెల్లిస్తే చాలు. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు. ఇక ఈ నోటిఫికేషన్ లోని లెవెల్‌- 4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే లెవెల్‌ – 2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.

Sri Lakshmi Stotram: రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు

ఎంపిక ప్రక్రియ.. మొదటగా స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండుతుంది. ఆపై వైద్య పరీక్షకు హాజరు కావల్సియి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో
* లెవెల్‌ – 4/5 పోస్టులు: 5
* లెవెల్‌-2/3 పోస్టులు: 16
* లెవెల్‌-1 పోస్టులు: 43 భర్తీ కానున్నాయి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.