రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన ఖాళీలను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. 3445 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27గా కేటాయించారు. అంటే ఎల్లుండి ఈ ప్రక్రియ ముగుస్తుంది.
READ MORE: Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామా.. ప్రపంచంలో ఇంత కాస్లీ స్కాం ఇంకోటి లేదు..
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఖాళీల వివరాలు: అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
మొత్తం ఖాళీలు: 3445 పోస్టులు
READ MORE: TTD: శ్రీవారి నడకదారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వాళ్లు రావొద్దు..!
విద్యా అర్హత..
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ (10+2) పరీక్ష లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ కేటగిరీ అభ్యర్థులు 12వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులను కలిగి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది.
వయోపరిమితి..
అర్హత గల దరఖాస్తుదారుల వయస్సు జనవరి 1, 2025 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, మహిళా అభ్యర్థులందరూ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.