రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువత కోసం మరో రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)కు సంబంధించి 9970 పోస్టులకు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. అప్పటి వరకు అభ్యర్థులు ఈ నియామకానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి.
దరఖాస్తు ఫీజు: ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్హత: టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల కనిష్ట వయసు18. గరిష్ట వయసు 33 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్లు అదనపు సడలింపు.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ల ద్వారా ఎంపిక ఉంటుంది.
జీతం భత్యాలు: అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.50,000 పైనే ఉండొచ్చు.
చాలా మంచి దరఖాస్తు చేసుకుంటారు. లక్షల మంది పోటీ పడతారు. మనకు ఎలాగో రాదు. మనకెందుకులే.. అని అనుకోవద్దు. అర్హత గల అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. “ప్రయత్నించకుండా ఓడిపోవడం కంటే, ప్రయత్నించి ఓడిపోవడం మేలు.” అనే సూత్రాన్ని మర్చిపోకండి.. ఆల్ ది బెస్ట్ మిత్రులారా..