Site icon NTV Telugu

RR vs SRH Qualifier 2: ఫైనల్ వెళ్లేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్..

Rr Vs Srh Qualifier 2

Rr Vs Srh Qualifier 2

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాజస్థాన్‌ రాయల్స్ (RR) మధ్య శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్‌ మైదానంలో క్వాలిఫయర్‌-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఇక వరుస ఓటముల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌ లో ఆర్సీబీ పై అద్భుత విజయం సాధించిన రాజస్థాన్‌.. ఫైనల్‌ బెర్తు కోసం కన్నేసింది. క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తనకు ఉన్న రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. మరి చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో.

Suresh Raina: పాక్ జర్నలిస్ట్‌ కు ‘రైనా’ దెబ్బ అదుర్స్.. దెబ్బకి నోరు మూయించాడుగా..

ఇక నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీనితో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదట బాటింగ్ చేయనుంది. ఇక నేటి మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలను చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా.. ఆర్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గా షిమ్రాన్ హెట్మెయర్, నంద్రే బర్గర్, శుభం దూబే, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్ లు ఉన్నారు.

AI Anchors: 50 భాషలలో ఏఐ యాంకర్లు రాబోతున్నారా.. డీడీ కిసాన్ వెల్లడి..

ఇక మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్ లు ఉండగా.. ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు.

Exit mobile version