Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most IPL Hundreds: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలి మూడు మ్యాచ్‌లలో (13, 11, 11) విఫలమైన బట్లర్.. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు కావల్సిన సమయంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఆ సిక్సర్‌తోనే శతకం సాధించాడు. అయితే బట్లర్ సిక్సర్‌తో సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. సిక్సర్ కొట్టాక బట్లర్ ఆనందంలో మునిగిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
జోస్ బట్లర్‌కు ఆర్‌సీబీ మ్యాచ్ 100వ ఐపీఎల్ మ్యాచ్. 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేయడం విశేషం. ఇదివరకు 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఫీట్ అందుకున్నాడు. 2022లో బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్.. 60 బంతుల్లో 103 రన్స్ చేశాడు. 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు రాహుల్, బట్లర్ మాత్రమే సెంచరీలు చేశారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
Also Read: Rajasthan Royals: ఒక్కో సిక్సర్.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్! రాజస్థాన్ రాయల్స్ సూపర్
జోస్ బట్లర్‌కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో కలిసి బట్లర్ సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ తలో నాలుగు సెంచరీలు చేశారు. ఏబీ డివిలియర్స్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌లు తలో 3 శతకాలు బాదారు.
A SIX TO REACH 100 IN HIS 100TH IPL MATCH – JOS BUTTLER THE HERO. 🔥pic.twitter.com/stcUviaWTg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!