NTV Telugu Site icon

Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్‌.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు

Jos Buttler Century

Jos Buttler Century

Most IPL Hundreds: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) స్టార్ బ్యాటర్ జోస్‌ బట్లర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలి మూడు మ్యాచ్‌లలో (13, 11, 11) విఫలమైన బట్లర్‌.. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ విజయానికి ఒక్క పరుగు కావల్సిన సమయంలో బట్లర్‌ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఆ సిక్సర్‌తోనే శతకం సాధించాడు. అయితే బట్లర్ సిక్సర్‌తో సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. సిక్సర్ కొట్టాక బట్లర్ ఆనందంలో మునిగిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌ అవుతోంది.

జోస్‌ బట్లర్‌కు ఆర్‌సీబీ మ్యాచ్‌ 100వ ఐపీఎల్ మ్యాచ్. 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో బట్లర్‌ సెంచరీ చేయడం విశేషం. ఇదివరకు 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఫీట్ అందుకున్నాడు. 2022లో బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్.. 60 బంతుల్లో 103 రన్స్ చేశాడు. 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు రాహుల్, బట్లర్‌ మాత్రమే సెంచరీలు చేశారు.

Also Read: Rajasthan Royals: ఒక్కో సిక్సర్‌.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్‌! రాజస్థాన్ రాయల్స్ సూపర్

జోస్‌ బట్లర్‌కు ఇది ఆరో ఐపీఎల్‌ సెంచరీ. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌తో కలిసి బట్లర్‌ సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. డేవిడ్‌ వార్నర్‌, షేన్‌ వాట్సన్‌, కేఎల్‌ రాహుల్‌ తలో నాలుగు సెంచరీలు చేశారు. ఏబీ డివిలియర్స్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌లు తలో 3 శతకాలు బాదారు.

Show comments