IPL 2024లో ఓటమి ఎరగని రాజస్థాన్ రాయల్స్, జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఐదు మ్యాచ్ ల్లో మూడు ఓటములతో పోరాడుతున్న టైటాన్స్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని విజయం కోసం పోరాడుతుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని కోల్పోయిన టైటాన్స్, గిల్ ప్రదర్శనపై ఆధారపడింది. ఇక ఈ మ్యాచ్ లో వారు బ్యాటింగ్ అసమానతలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గిల్ యొక్క ఓపెనింగ్ భాగస్వామి బి సాయి సుదర్శన్, అఫ్ఘాన్ త్రయం పేలవంగా రాణిస్తున్నారు.
Also read: RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!
ఇక నేడు జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా దాదాపు 15 నిమిషాలపాటు మ్యాచ్ ఆరంభం అయ్యింది. ఇక టాస్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఇరు జట్ల ఆటగాళ్ల విషయానికి వస్తే..
Also read: YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే.. పేదలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI గా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా మరోవైపు గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (WK), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మలుగా ఉన్నారు.
