Maharashtra: పార్కింగ్ విషయంలో గొడవ..పోలీసు చెంప దెబ్బ కొట్టడంతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల కారణంతోనే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. తమ పంతం నెగ్గించుకోవడం కోసమో, ఇగోల కారణంతోనే ఎదుటివారిపై దాడి చేస్తున్నారు. ప్రాణాలంటే విలువలేకుండా క్షణాల్లో హత్య చేసేస్తున్నారు. తరువాతి పరిణామాలు, జీవితం గురించి ఆలోచించకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తిని కొట్టింది ఓ పోలీసు అధికారి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన.
Also Read: Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..అందరు చూస్తుండగానే ఆ పని.. వీడియో…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
వివరాల ప్రకారం ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన నిఖిల్ గుప్తా వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన చెల్లిల్ని చూడటానికి వచ్చాడు. ఆయన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పని చేస్తున్నాడు. ఇంటి ముందు కారు పార్క్ చేస్తుండగా హెడ్‌లైట్ హైబీమ్‌లో ఉండటంతో అక్కడే ఉంటున్న స్థానికుడు 54 ఏళ్ల వ్యక్తి మురణీధర్ రామరావ్‌జీ నవారే ఇబ్బంది పడ్డాడు. దీంతో కారు లైట్ లో బీమ్ లో పెట్టి పార్క్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్, నవారే చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆయన రెండు రోజుల్లో చనిపోయాడు. నిఖిల్ కొట్టడం వల్లే ఆయన చనిపోయినట్లు వైద్యలు నిర్ధారించారు. దీంతో పోలీసులు నిఖిల్‌పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. చిన్న గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆవేశంతో చేసే పనుల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..