NTV Telugu Site icon

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ .. సిద్ధార్థ లాల్ సక్సెస్ స్టోరీ

New Project (69)

New Project (69)

Royal Enfield: బుల్లెట్ నేడు యువత ఫస్ట్ ఛాయిస్. నేడు రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద లాభదాయక సంస్థగా అవతరించింది. అయితే 1994లో బుల్లెట్ దివాలా అంచున ఉన్న సంగతి తెలిసిందే. బుల్లెట్ మాతృ సంస్థ దీన్ని మూసివేయాలనుకుంది. కానీ సిద్ధార్థ లాల్ అనే 26ఏళ్ల యువ ఇంజనీర్ దివాలా అంచుల నుండి దేశంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా మార్చాడు. ఐషర్ గ్రూప్ 2000లో నష్టాలను చవిచూసింది. ఆ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను విక్రయించడం లేదా మూసివేయడం సరైన నిర్ణయమని గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లందరూ అభిప్రాయపడ్డారు. గ్రూప్‌లోని ఈ విభాగం రూ. 20 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ సమయంలో విక్రమ్ లాల్ కుమారుడు సిద్ధార్థ్ లాల్ డివిజన్‌ను నికర లాభంలోకి తీసుకురావడానికి 24 నెలల సమయం కోరారు. సిద్ధార్థ్ విభాగానికి అధిపతి అయ్యాడు.

Read Also:Guntur Kaaram: మహేష్ కోసం మాటలే కాదు పాటలు కూడా రాస్తున్న మాంత్రికుడు…

అప్పటికే జైపూర్‌లోని కొత్త ఎన్‌ఫీల్డ్ ప్లాంట్‌ మూతపడింది. దీని తర్వాత కంపెనీకి ప్రతినెలా రూ.80 లక్షల నష్టం వచ్చేది. ఈ సమయంలోనే సిద్ధార్థ మరో మార్కెట్ లేదా సెగ్మెంట్‌లోకి ప్రవేశించే బదులు, ఇప్పటికే ఉన్న బ్రాండ్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నించడం మంచిదని సిద్ధార్థ్ లాల్ నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్ లాల్ 2001 సంవత్సరంలో 350 సిసి బుల్లెట్ ఎలక్ట్రాను ప్రారంభించాడు. ఇది నగరంలోని 18-35 ఏళ్ల యువకులను లక్ష్యంగా చేసుకుంది. ఇది యువతకు బాగా నచ్చింది. దీని తర్వాత కంపెనీ 2002లో థండర్‌బర్డ్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత కంపెనీ లాభాల బాట పట్టడం ప్రారంభించింది. సిద్ధార్థ్ రిటైల్ అవుట్‌లెట్‌లు, మార్కెటింగ్‌పై చాలా శ్రద్ధ చూపాడు. బైక్ కొనుగోలుదారులకు మెరుగైన అనుభవాన్ని అందించే ఔట్‌లెట్లను ఆయన ప్రారంభించారు. అతను తన విజయాలకు అనేక అవార్డులు, ప్రశంసలను కూడా గెలుచుకున్నాడు.

Read Also:Hyderabad CP: హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియామకం!