Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. రెట్రో-ఫ్యూచరిస్టిక్ లుక్‌తో

  • రాయల్ ఎన్ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
  • 2026 మొదటి త్రైమాసికంలో (Q1 2026) లాంచ్
  • ఇది సిటీ + మొబిలిటీ కోసం డిజైన్ చేసిన బైక్
Royal Enfield Electric Bike

Royal Enfield Electric Bike

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఇప్పుడు ఈ లెజెండరీ కంపెనీ ఎలక్ట్రిక్ యుగంలోకి అడుగుపెట్టింది. దీని తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సబ్-బ్రాండ్ పేరు Flying Flea. ఇందులో మొదటి మోడల్ Flying Flea C6 .. 2026 మొదటి త్రైమాసికంలో (Q1 2026) లాంచ్ అవుతుందని అధికారికంగా నిర్ధారణ అయింది. దీని డిజైన్ రెండవ ప్రపంచ యుద్ధం కాలంలోని ఒరిజినల్ Flying Flea మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది. రెట్రో, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉంటుంది. సరళమైన, లైట్‌వెయిట్ బాడీ, గిర్డర్ ఫ్రంట్ సస్పెన్షన్, ఆర్టిక్యులేటింగ్ మడ్‌గార్డ్ వంటివి ఉంటాయి.

Also Read:Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్‌లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు

ఇది సిటీ + మొబిలిటీ కోసం డిజైన్ చేసిన బైక్. లైట్‌వెయిట్, అగైల్ రైడింగ్ ఇస్తుంది. రేంజ్ దాదాపు 150-160 కి.మీ వరకు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. టాప్ స్పీడ్ 100-115 కి.మీ/గం వరకు ఉండే అవకాశం ఉంది. 100% ఎలక్ట్రిక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆధునిక ఫీచర్లతో కూడిన డిస్‌ప్లే. ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. కొత్త ‘L’ ప్లాట్‌ఫాం మీద బిల్ట్ అవుతుంది. ఇదే ప్లాట్‌ఫాం మీద తర్వాత Flying Flea S6 (స్క్రాంబ్లర్ స్టైల్) కూడా వస్తుంది. అది 2026 చివరిలో లాంచ్ అవుతుందని అంచనా.

Also Read:Odisha: ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. విధుల్లో ఉన్న ఐదుగురు పోలీసులు మృతి

రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO B. Govindarajan ఇటీవల ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు – C6 “అల్మోస్ట్ రెడీ ఫర్ ప్రొడక్షన్” అని, తదుపరి కొన్ని నెలల్లో (Q1 2026) మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో (చెన్నైలో) ఫైనల్ ఫామ్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. కవర్ లేకుండా స్పాట్ అయింది. ధర విషయంలో అధికారిక ప్రకటన రాలేదు, కానీ అంచనాల ప్రకారం రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ఉండవచ్చు (ఎక్స్-షోరూమ్). ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 450cc, 650cc మోడల్స్ మధ్యలో ప్రీమియం సెగ్మెంట్‌లో ఉంటుంది.