Site icon NTV Telugu

RCB Unbox Event 2025: ‘ఈ సాలా కప్ నమ్దే’.. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ డేట్ లాక్

Rcb

Rcb

RCB Unbox Event 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ 18వ ఎడిషన్ గా జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది. ప్రతి సారి లాగా ఈ సారి కూడా ఐపీఎల్ లోని అన్ని జట్లు తమ జట్లను మెరుగుపరుచుకోవడానికి, కొత్త క్రీడాకారులను తీసుకోని కప్ గెలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే తన ప్రతిష్టాత్మక అనబాక్స్ ఈవెంట్ ను ప్రకటించింది. ఈ కార్యక్రమం మార్చి 17, 2025 న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రతి ఏడాది ఈ ఈవెంట్‌లో జట్టు తన కొత్త జెర్సీని విడుదల చేస్తుంది. అలాగే కొత్త కెప్టెన్‌ను అభిమానుల ముందుకు తీసుకొస్తుంది.

Read Also: BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!

ఈ సారి RCB జట్టు కొత్త కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను నియమించింది. ఈ అనబాక్స్ ఈవెంట్‌లో ఆయన అధికారికంగా అభిమానుల ముందుకు రానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తమ ఫేవరెట్ జట్టు, క్రీడాకారులతో కలవడానికి అవకాశం లభిస్తుంది. ఈ ఈవెంట్ RCB అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈ అనబాక్స్ ఈవెంట్ RCB జట్టు ప్రియులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనుంది. ఆటగాళ్లతో సన్నిహితంగా కలిసే అవకాశం, కొత్త జెర్సీని ప్రత్యక్షంగా చూడటం వంటి అనేక ప్రత్యేక ఘట్టాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. రజత్ పాటీదార్ కొత్త కెప్టెన్‌గా విజయం సాధించి, జట్టును విజయపథంలో నడిపిస్తాడని RCB అభిమానులు ఆశిస్తున్నారు.

RCB జట్టు ఎన్నో సీజన్‌లలో బాగా ఆడినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. కానీ ఈ సారి కొత్త కెప్టెన్, కొత్త దృక్పథంతో జట్టు ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ తర్వాత RCB జట్టు తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించనుంది. మొత్తానికి, RCB అనబాక్స్ ఈవెంట్ RCB అభిమానులకు కిక్కు ఇచ్చే కార్యక్రమంగా ఉండనుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Exit mobile version