Site icon NTV Telugu

Tollywood : ‘నేచురల్ స్టార్’ని వెనక్కి నెట్టిన ‘రౌడీ బాయ్’

Kingdom (2)

Kingdom (2)

టాలీవుడ్ లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు కానీ వారిలో కొందరి సినిమాలకు మాత్రమే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. అటువంటి వారిని టైర్ 2 హీరోలుగా పిలుస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇంకొందరు ఉన్నారు. వీరి సినిమాలు రిలీజ్ అంటే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పడు వీరి మధ్య పోటీ వాడివేడిగా జరుగుతుంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ కాస్త ఎక్కువగానే ఉంది.

Also Read : Kingdom : కింగ్డమ్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. కారణం ఇదే

కింగ్డమ్ రిలీజ్ నేపథ్యంలో నాని గత సినిమాల కలెక్షన్స్ కు విజయ్ సినిమాకు మధ్య కంపారిజన్ మొదలైంది. కేవలం రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే ఉన్న కింగ్డమ్ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ చేసారు. ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 248 లొకేషన్స్ లో 578 షోస్ కు గాను 15,228 టికెట్స్ తో $293,748 వసులు చేసింది. అదే నాని గత చిత్రం HIT 3 సినిమా 356 లొకేషన్స్ లో 930షోస్ కు గాను 13,184 టికెట్స్ తో  $260,875 వసూలు చేసింది. కింగ్డమ్ షోస్ పెంచితే ఇంక భారీ నంబర్ వచ్చే అవకాశం ఉంది. వరుస హిట్స్ కొడుతున్న నాని సినిమాను వరుస ప్లాప్స్ కొడుతున్న విజయ్ దేవరకొండ క్రాస్ చేయడం కింగ్డమ్ క్రేజ్ ఎలా ఉందొ తెలియజేస్తుంది.  హిట్ టాక్ వస్తే హిట్ 3 ఫైనల్ రన్ ను అవలీలగా దాటేసేలా ఉన్నాడు విజయ్ దేవరకొండ.

Exit mobile version