Site icon NTV Telugu

Pranitha Subhash Pregnancy: రౌండ్ 2.. రెండేళ్లకే! తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత

Pranitha Subhash Pregnancy

Pranitha Subhash Pregnancy

Actress Pranitha Subhash Baby Bump Pics Goes Viral: హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి గుడ్‌ న్యూస్ చెప్పారు. రౌండ్ 2 అంటూ.. తాను రెండోసారి తల్లి అవుతున్నట్లు తెలిపారు. ‘రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు సరిపోవు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణీత ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి బేబీ బంప్‌తో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రణీతకు అభినందనలు చెబుతున్నారు.

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని 2021లో ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. వీరికి 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించారు. రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం బాపుబొమ్మ ప్రణీత బెంగళూరులో ఉంటున్నారు. తెలుగు ఢీ డ్యాన్స్ షోలో ఇటీవల కొన్ని ఎపిసోడ్‌లకి ప్రణీత జడ్జీగా వ్యవహరించారు. ఉన్నపళంగా ప్రణీత ప్లేస్‌లోకి హన్సిక వచ్చారు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది.

Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్ ఆరంభానికి ముందు షాక్.. ఐదుగురికి కరోనా!

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో ప్రణీత సుభాష్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేశారు. తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఈ ఏడాదిలో కన్నడ, మలయాళ సినిమాల్లో ఆమె నటించారు.

Exit mobile version