AP Weather Alert: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం, పాలకాయత్తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం వద్దకు వెళ్లిన పర్యాటకులను స్థానిక పోలీసులు వెనక్కి పంపుతున్నారు.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వారికి సంబంధించిన వేట బోట్లు, వలలు సురిక్షిత ప్రాంతాల్లో భద్ర పర్చుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచించారు. సముద్రg అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోడూరు మండల ఇన్‌ఛార్జి తాహసీల్దార్ సౌజన్య కిరణ్మయి హెచ్చరికలు జారీ చేశారు.
READ MORE: Modi Trump meeting: సుంకాల సెగలో ప్రధాని మోడీ.. ట్రంప్‌ను కలుస్తారా?
మరోవైపు బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వివరించింది.
