శ్రీకాంత్ తనయుడిగా ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాలతో మెప్పించిన రోషన్ మేకా, ఇప్పుడు తన కెరీర్‌ను మలుపు తిప్పే ‘ఛాంపియన్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.. ‘ వారసత్వంతో రావడం అదృష్టమే కానీ, ఇక్కడ నిలబడాలి అంటే కష్టం కావాలి’ అని చెబుతూ, ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా పడ్డ శ్రమను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి శ్రీకాంత్ కష్టాన్ని చూస్తూ పెరిగిన తాను, ఆయన పేరు నిలబెట్టేలా ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డానని రోషన్ చెప్పిన తీరు ఆయన పరిణతిని చాటిచెప్పింది.
Also Read : The Raja Saab : రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ అప్‌డెట్ ..?
ఈ సినిమాలో రోషన్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతుండగా ఈ పాత్ర కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ మరియు ట్రైలర్‌లో చూపించిన ఎనర్జీ చూస్తుంటే రోషన్ కెరీర్‌కు ఇది కచ్చితంగా ఒక ‘టర్నింగ్ పాయింట్’ అనిపిస్తోంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడి జీవితంలోని గెలుపు ఓటములు, రాజకీయాలు, మరియు ఎమోషన్స్‌ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ట్రైలర్ చూస్తుంటే, రోషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘ఛాంపియన్’ అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
