Site icon NTV Telugu

Roshan Kanakala: రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పిన రోషన్ కనకాల..

Roshan Kanakala

Roshan Kanakala

‘బబుల్‌గమ్‌’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్‌ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే

Also Read : Dhurandhar : బాలీవుడ్ ‘ధురంధర్’ సినిమా‌పై .. పుష్ప రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘‘ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మోగ్లీ అనే కుర్రాడి కథ ఇది. అతడి ప్రేమకు ఎదురైన అడ్డంకి ఏంటి? క్రిస్టఫర్‌ నోలన్‌ అనే వ్యక్తి నుంచి అతడికి ఎదురైన సవాళ్లు ఏంటన్నది అసలు కథ. అటవీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో వినోదం, యాక్షన్‌తో పాటు అన్ని భావోద్వేగాలు సహజంగా పండాయి. సందీప్‌ ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌, ప్రీ ఇంటర్వెల్‌ సీన్స్ ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్‌ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని రోషన్‌ చెప్పారు. అటవీ ప్రాంతంలో షూటింగ్‌ చేయడం సవాళ్లతో కూడుకున్నదే అయినా,

ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు రోషన్‌ వెల్లడించారు.. ‘‘ఈ సినిమా తర్వాత అడవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. సిటీకి వస్తే ఇది నా ప్రపంచం కాదన్న భావన కలిగేది’’ అన్నారు. అలాగే సినిమాల‌పై తనకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉందని, నటన విషయంలో తండ్రితో చర్చలు జరుగుతుంటాయని చెప్పారు. ప్రస్తుతం తాను రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలిపారు. వాటిలో ఒకటి ఇంటెన్స్ లవ్ స్టోరీ కాగా, మరొకటి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని అన్నారు.

Exit mobile version