Site icon NTV Telugu

Roshan Meka : ఒక్క హిట్‌తో ఇద్దరు బడా నిర్మాతల దృష్టిలో పడ్డ రోషన్..

Roshan Meka

Roshan Meka

తాజాగా విడుదలైన వరుస సినిమాలో ‘ఛాంపియన్’ ఒకటి. యంగ్ హీరో రోషన్ మేక తన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా చూసిన టాలీవుడ్ లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్, రోషన్ నటనకు పూర్తిగా ఫిదా అయిపోయారు. దీంతో స్వయంగా రోషన్‌ను కలిసి అభినందనలు తెలపడమే కాకుండా, తన సొంత బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’లో ఒక సినిమా చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి అవకాశం రావడం రోషన్ కెరీర్‌కు పెద్ద మైలురాయి అని చెప్పొచ్చు. అంతే కాదు..

Also Read : Rashmika : ఇక రూటు మారుస్తా అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక

కేవలం గీతా ఆర్ట్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ కూడా రోషన్‌తో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఛాంపియన్’లో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎనర్జీ చూసి నిర్మాతలు నాగవంశీ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ పెద్ద బ్యానర్లలో సినిమాలు ఓకే అవ్వడంతో రోషన్ టాలీవుడ్ నెక్స్ట్ స్టార్ రేస్‌లోకి దూసుకువస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన దర్శకులు, ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి శ్రీకాంత్ తనయుడు ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఇండస్ట్రీలో బిజీ అయిపోతున్నాడు.

Exit mobile version