రోజాలంటే ఇష్ట పడని వాళ్ళు అస్సలు ఉండరు.. మగువల అందాన్ని మెరుగు పరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి..పూలను పూజలో, అలంకరణకు, బ్యూటీ కేర్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. గులాబీలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను శతాబ్దాలుగా మూలికా వైద్యంలో వినియోగిస్తారు. గులాబీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ టీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గులాబీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గులాబీ రేకులతో తయారు చేసిన టీ తరచు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక కప్పు రోజ్ టీని ఇలా తీసుకోవడం వల్ల స్ట్రెస్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. గులాబీలోని పోషకాలు విశ్రాంతిని కలిగిస్తాయి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాలను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలనూ దూరం చేస్తుంది. రోజ్ టీ వేడిగా కంటే చల్లగా రుచి ఇంకా బాగుంటుంది..
నెలసరి సమయంలో రోజ్ టీ తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తింది. రోజ్ టీ మానసిక, శారీరక పీరియడ్ లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్‌లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది..
ఇకపోతే ఈ టీలో విటమిన్ ఏ, సి , పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు త్వరిత శక్తినిస్తాయి. రోగనిరోధకత శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీ మిమ్మల్ని అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌లను నయం చేసి బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది.. ఎప్పుడు దగ్గు, జలుబు బారిన పడకుండా చేస్తుంది..
ఒంట్లో అధిక కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. గులాబీ రేకులలోని యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. క్యాన్సర్ వంటి క్షీణించిన వ్యాధులను నివారించడానికి ఈ టీ సహాయ పడుతుంది..
జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఎన్నో శతాబ్దాలుగా ఉపోయోగిస్తున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి..
టీ తయారీ విధానం :
లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు వేయాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి.. ఆ తర్వాత తేనే, రోజ్ నీరును వేసి కలపాలి.. అంతే టీ రెడీ..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.