Site icon NTV Telugu

Romario Shepherd: విద్వంసం సృష్టించిన ముంబై బ్యాటర్.. ఓకే ఓవర్‌లో 32 పరుగులు..!

150

150

2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లు లో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.

Also read: Mandakrishna Madiga: టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించింది..

ఈ సీజన్ లో ఒక విజయాన్ని కూడా సాధించేలేకపోయామన్న విషయము ఏమో కానీ.. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఒకరిని మించి ఒకరు స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించారు. ఇందులో ఓపెనర్లు రోహిత్ శర్మ 27 బంతులలో 49 పరుగులు చేయగా.. ఇషాంత్ కిషన్ 23 బంతులలో 43 పరుగులు చేసి మొదటగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇశాంత్ కిషన్ అవుటైన తర్వాత గ్రీస్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ డక్ అవుట్ గా వెనుతిరిగి క్రికెట్ ప్రేమికులను నిరసపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య 33 బంతుల్లో 39 పరుగుల గౌరవమైన స్కోర్ చేశాడు. అప్పటివరకు మ్యాచ్ కాస్త వేగంగానే వెళ్తున్న స్కోర్ బోర్డు ఆ తర్వాత టిమ్‌ డేవిడ్‌, రొమారియా షెఫర్డ్‌ ల దాటికి స్కోరుబోర్డు జెట్ స్పీడ్ లాగా దూసుకెళ్లింది. ఇకపోతే టిమ్‌ డేవిడ్‌ 24 బంతులతో 45 పరుగులు చేయగా.. రొమారియా షెఫర్డ్‌ మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతులు ఇన్నింగ్స్ లో మిగిలి ఉన్న సమయంలో క్రీజ్ లోకి వచ్చిన అతడు ఏకంగా 10 బంతులతో 39 పరుగులను రాబట్టాడు.

Also read: Thief Devotee: భక్తి మాయలో అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ చేసిన ఘనుడు..!

ఇక చివరి ఓవర్లో రొమారియా షెఫర్డ్‌ ఓ పెను తుఫాను సృష్టించాడు. 2 ఫోర్లు, 4 సిక్సులు సహాయంతో ఏకంగా 32 పరుగులను రాబట్టాడు ఈ వెస్టిండీస్ ప్లేయర్. దీంతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 20 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టడంతో ముంబై అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి చూసేయండి.

Exit mobile version