Sikandar : హీరోహీరోయిన్ల వయసులో భారీ తేడా.. డైరెక్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
- మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ సినిమా
- రష్మిక, సల్మాన్ మధ్య రెండు రొమాంటిక్ సాంగ్స్
- రూట్ మార్చిన దర్శకుడు క్లిక్ అవుతుందని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikandar : సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు హిట్ తప్పని సరి. దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా సల్మాన్ సరసన ఫస్ట్ టైం నేషనల్ క్రష్ రష్మిక నటించడం కూడా సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. ఇక్కడి రాయల్ ప్యాలెస్ అయిన ఫలక్ నుమా ప్యాలెస్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు మురుగదాస్. సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. సల్మాన్ ను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో పోలీసులు సల్మాన్ చుట్టూ భద్రత వలయం ఏర్పాట్లు చేశారు. పోలీసులు షూటింగ్ పరిసర ప్రాంతంలో ఎవరిని అనుమతించట్లేదు. కేవలం సినిమాకు చెందిన యూనిట్ ను మాత్రమే షూట్ లోకి అనుమతి ఇచ్చారు.
Also Read
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
Read Also:Fire Accident: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి..
మురగదాస్ మార్క్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని…ప్రేక్షకులు ఊహించని విధంగా అవి ఎంతో క్రియేటివ్ గా మురగదాస్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వాటి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. దేశ విదేశాల్లో ఆ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారట. మరి ఇలాంటి యాక్షన్ సినిమాలో హీరో-హీరోయిన్ మధ్య రొమాన్స్ ఉంటుందా? అంటే సాధారణంగా మురగదాస్ సినిమాల్లో జోడీల మధ్య రొమాన్స్ అనేది పెద్దగా కనిపించదు. అలాంటి వాటికి మురగదాస్ ప్రాధాన్యతను ఇవ్వరు. కానీ ఈ విషయంలో మురగదాస్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది..
సికిందర్ మూవీలో హీరోహీరోయిన్ల నడుమ లెక్కకు మించి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అందులో రెండు పాటలు అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ గా ఉంటాయట. ఆ పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్-రష్మిక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పర్పెక్ట్ గా వర్కౌట్ అయిందంటున్నారు. సల్మాన్, రష్మికల మధ్య దాదాపు 30ఏళ్ల తేడా ఉన్నా థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి ఆ ఫీల్ ఎక్కడా కలగదని సల్మాన్ వయసుని రష్మిక మ్యాచ్ చేసేలా పెర్పార్మెన్స్ ఇచ్చిందని యూనిట్ చెబుతుంది. ఈ పాటలు రెండు ఈద్…హోలీ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయట. రెండు పాటలు ఇన్ స్టెంట్ చార్ బ్లస్టర్లుగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 2025 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!