Site icon NTV Telugu

GT vs MI: చితకబాదిన హిట్‌మ్యాన్.. గుజరాత్‌ ముందు భారీ లక్ష్యం..!

Mi Gt

Mi Gt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఈరోజు ముంబై ఇండియన్స్ (MI)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 2228 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెయిర్‌ స్టో (47) సైతం క్రీజ్‌లో ఉన్నంతవరకు రప్ఫాడించాడు. సూర్యకుమార్ (33), తిలక్ వర్మ (25) పర్వాలేదనిపించారు. హార్దిక్ పాండ్య (22) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.

READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!

కాగా.. ముంబై ఇండియన్స్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. జానీ బెయిర్‌స్టో, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌ నష్టానికి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే.. ఈ భాగస్వామ్యంలో రోహిత్ శర్మ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. 84 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్ కోల్పోయింది. సాయి కిశోర్ ఓవర్‌లో బెయిర్‌ స్టో (47) ఔటయ్యాడు. సూర్యకుమార్ (33) కూడా సాయి కిశోర్ ఓవర్‌లో వెనుదిరిగాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన రోహిత్‌శర్మ (81) ప్రసిద్ధ్‌ కృష్ణ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సిరాజ్ చేతిలో తిలక్ వర్మ (25) ఔటయ్యాడు. అనంతరం నమన్ ధీర్ (9) పెవిలియన్‌కు చేరాడు. హార్దిక్ పాండ్య (22) , శాంట్నర్ (0) నాటౌట్‌గా నిలిచారు. కాగా.. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

Exit mobile version